LEHARAAYI LYRICS Telugu | Leharaayi Song Lyrics in Telugu

LEHARAAYI LYRICS – Most Eligible Bachelor Movie Song 

Ghh

అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంటగా మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కిస్తున్న రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్. ఈ సినిమాను జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. తాజాగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ చిత్రం నుంచి రొమాంటిక్ లెహరాయి లిరికల్ సాంగ్ విడుదలైంది. లెహరాయి లెహరాయి గుండెలోని ఆశలన్నీ ఎగిరాయి అంటూ సాగే ఈ పాటను తనదైన శైలిలో అద్భుతంగా ఆలపించారు సిద్ శ్రీరామ్. తాజాగా విడుదలైన ఈ పాటకు అనూహ్య స్పందన వస్తుంది. అఖిల్, పూజ హెగ్డే రొమాన్స్ కూడా అదిరిపోయింది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఆడియో ఆదిత్య మ్యూజిక్ ద్వారా మార్కెట్లోకి విడుదల కానుంది. ఈ సినిమాను అక్టోబర్ 8న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు యూనిట్. త‌న చిత్రాల్లోని పాత్ర‌ల్ని చాలా క్యూట్ రొమాన్స్‌తో ల‌వ్ లీగా వుండేలా డిజైన్ చేస్తారు దర్శకుడు భాస్కర్. ఇప్పుడు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమాలో కూడా అన్ని పాత్రలను అలాగే డిజైన్ చేస్తున్నారు.

ఈ పాట లిరిక్స్..

లెహరాయి.. లెహరాయీ.. ఏ లేలేలే.. లేలేలేలే..

లెహరాయీ లెహరాయీ.. గుండె వెచ్చనయ్యే ఊహలెగిరాయి..

లెహరాయీ లెహరాయీ.. గోరు వెచ్చనైన ఊసులదిరాయి..

ఇన్ని నాళ్ళు ఎంత ఎంత వేచాయి..

కళ్లలోనే దాగి ఉన్న అమ్మాయి..

సొంతమల్లే చేరుతుంటే ప్రాణమంత చెప్పలేని హాయీ..

లెహరాయీ లెహరాయీ.. గుండె వెచ్చనయ్యే ఊహలెగిరాయి..

లెహరాయీ లెహరాయీ.. గోరు వెచ్చనైన ఊసులదిరాయి..

రోజూ చక్కిలితో సిగ్గుల తగువాయే..

రోజూ పెదవులతో ముద్దుల గొడవాయే..

వంట గదిలో మంటలన్నీ ఒంటిలోకే ఒంపుతుంటే..

మరి నిన్నా మొన్నా ఒంటిగా ఉన్న ఈడే నేడే లెహరాయీ..

లెహరాయీ లెహరాయీ.. గుండె వెచ్చనయ్యే ఊహలెగిరాయి..

లెహరాయీ లెహరాయీ.. గోరు వెచ్చనైన ఊసులదిరాయి..

వేలా పాలలనే మరిచే సరసాలే..

తేదీ వారాలే చెరిపే చెరసాలే..

చనువు కొంచెం పెంచుకుంటూ.. తనువు బరువే పంచుకుంటూ..

మనలోకం మైకం ఏకం అవుతూ.. ఏకాంతాలే లెహరాయీ..

లెహరాయీ లెహరాయీ.. గుండె వెచ్చనయ్యే ఊహలెగిరాయి..

లెహరాయీ లెహరాయీ.. గోరు వెచ్చనైన ఊసులదిరాయి..

ఇన్ని నాళ్ళు ఎంత ఎంత వేచాయి..

కళ్లలోనే దాగి ఉన్న అమ్మాయి..

సొంతమల్లే చేరుతుంటే ప్రాణమంత చెప్పలేని హాయీ..

 Music Video

Post a Comment

Post a Comment